కోటవురట్ల: కేళీలతో తగ్గనున్న వరి దిగుబడి

83చూసినవారు
కోటవురట్ల: కేళీలతో తగ్గనున్న వరి దిగుబడి
సకాలంలో వర్షాలు కురిసి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో వరిపంట ఏపుగా పెరింది. అయితే వరి పంటలో 25శాతం కేళీల ఉండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కేళీల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని కోటవురట్లకు చెందిన రైతు అంగిరెడ్డి కృష్ణ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కోటవురట్ల, కైలాసపట్నం, లింగాపురం, జల్లూరు, బీకే పల్లి తదితర గ్రామాల్లో 1600 హెక్టార్లలో ఈ ఏడాది రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్