కనుమ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీకి నక్కపల్లి మండలం ఉపమాక పుణ్య క్షేత్రంలో బుధవారం గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి భక్తులకు రాజాధిరాజు అలంకరణలో పుణ్యకోటి వాహనంపై గురుడాద్రి పర్వతం చుట్టూ వందలాదిమంది భక్తులతో గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా కనుమ పండుగ రోజు ఈ ఉత్సవం నిర్వహిస్తామన్నారు.