కాకినాడలో వ్యతిరేకించిన బల్క్ డ్రగ్ పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని రాజయ్యపేటకు చెందిన స్థానిక యువకులు ఆదివారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు విజ్ఞప్తి చేశారు. రాజయ్యపేటలో హోంమంత్రి పర్యటనలో స్థానిక యువకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీనిపై హోంమంత్రి స్పందిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసే ముందు గ్రామసభలు నిర్వహించి స్థానికులు అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు.