నూతన సంవత్సర వేడుకలపై పాయకరావుపేట మండలంలో సిఐ అప్పన్న ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. మద్యం సేవించడం అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం, డీజే లు బైక్, కారు రేసులు నిర్వహించకూడదని.. పోలీస్ శాఖ యాక్ట్ 30 అమల్లో ఉండనున్నట్లు వివరించారు.