విజయవాడ ప్రాంతంలో వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని విశాఖ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పెందుర్తి బర్దన్ కాలనీలో సిపిఐ శ్రేణులు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వరదల్లో జరిగిన నష్టం వివరించి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వై రాంబాబు, ఏ అన్నపూర్ణ పాల్గొన్నారు.