విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి పెందుర్తికి చెందిన అంబిక స్వీట్స్ యజమాని ఎన్ సత్యనారాయణ, గీతారాణి దంపతులు1, 00, 116 రూపాయలకు చెక్కును గురువారం విరాళంగా ఆలయ ఈవో శ్రీనివాసమూర్తికి అందజేశారు. వీరికి స్వామివారి ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.