అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మ బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షేకావత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్రలోనే ముత్యాలమ్మపాలెం బీచ్ చుట్టూ కొండలు అడవులతో అద్భుతంగా ఉంటుందన్నారు. దీనిని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే పర్యటకులను ఆకర్షిస్తుందన్నారు.