దేవీపట్నం: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి

72చూసినవారు
దేవీపట్నం మండలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దళారులు తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఇందుకూరుపేట గ్రామంలో గురువారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నష్ట పోకుండా అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో దాదాపుగా 6000 ఎకరాల్లో వరి పంట సాగు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్