పారిశుద్ధ్య కార్మికులకు నెలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ, ఉపాధ్యక్షుడు శాంతిరాజు డిమాండ్ చేశారు. గురువారం రంపచోడవరం సిఐటియు కార్యాలయం వద్ద ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత తదితరవి కల్పించాలన్నారు.