ముఖ్యమంత్రి చంద్రబాబు నావికా దళ విన్యాసాల్లో పాల్గొనేందుకు జనవరి 4న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్, నేవీ కమోడర్ మోహన్ బుధవారం పరిశీలించారు. సీఎం సభాస్థలికి చేరుకునే దగ్గరనుంచి తిరుగు ప్రయాణమయ్యే వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్సీబీ మీదుగా ఆర్కే బీచ్ కు చేరుకుంటారని తెలిపారు.