స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోము: లోకేష్

55చూసినవారు
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోము: లోకేష్
ఉక్కు పరిశ్రమ అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన. 'స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనివ్వమని సీఎం స్వయంగా చెప్పారు. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే అన్నాను. వైసీపీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొంచమైనా సాయం అందిందా? ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనే లేదు' అని లోకేష్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్