రానున్న 18నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విశాఖ ఎంపి శ్రీభరత్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో విశాఖపట్నం దేశంలో 10వ నగరంగా ఉండగా, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో మాత్రం 27వ స్థానంలో ఉందని అంటూ ఈ గ్యాప్ ను సరిదిద్దాల్సి ఉందని చెప్పారు. విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. షీలానగర్ – సబ్బవరం రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.