విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం రైతు బజార్లో ఏర్పాటుచేసిన పెప్మా అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే గణబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.