విశాఖ: 1, 383 డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలిక రద్దు

52చూసినవారు
విశాఖ: 1, 383 డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలిక రద్దు
ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న వాహనదారులపై విశాఖ పోలీస్ శాఖ కేసులు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా 1, 383 మంది డ్రైవింగ్ లైసెన్సులు 3 నెలలు సస్పెండ్ చేసినట్లు ఉప రవాణా కమిషనర్ ఆదినారాయణ శనివారం తెలిపారు. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు 5, 104 వాహనాలపై కేసులు నమోదు చేసి 1, 383 డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్