విశాఖ: పండుగ పూట తీవ్ర విషాదం

59చూసినవారు
విశాఖ: పండుగ పూట తీవ్ర విషాదం
ఐదేళ్ల చిన్నారిని కారు కబళించిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నారిపై కారు ఎక్కడంతో ఆ చిన్నారి మృత్యువాత పడింది. విశాఖలోని సుజాతనగర్‌కు చెందిన దంపతులు తమ బంధువుల ఇంటికి సంక్రాంతి పండుగకి వచ్చారు. వారి ఐదేళ్ల చిన్నారి సెల్లార్ వద్ద ఆడుకుంటుండగా కారు ఢీకొంది. చిన్నారిని కిమ్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫార్మా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్