అచ్యుతాపురం: దొంగను అరెస్టు చేసిన పోలీసులు

53చూసినవారు
అచ్యుతాపురం: దొంగను అరెస్టు చేసిన పోలీసులు
అచ్యుతాపురం మండలం జంగులూరు జంక్షన్ వద్ద సోమవారం దొంగను అరెస్టు చేసినట్లు సిఐ నమ్మి గణేష్ తెలిపారు. అదే మండలం పూడిమడక శివారు కొండపాలెం గ్రామానికి చెందిన సిహెచ్ గంగరాజు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకుని విచారించగా గత ఏడాది దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. అతని వద్ద బంగారు చైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ సీజ్ చేసామన్నారు.

సంబంధిత పోస్ట్