వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించి వరి పంటను కాపాడుకోవాలని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్రావు సూచించారు. మంగళవారం యలమంచిలిలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాతావరణం పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోసిన పంట తడవకుండా టార్పాలిన్ లు వేసుకుని పంట నూర్పిడి చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారి పి. మోహన్ రావు, ఏఈఓ దేవుడు పాల్గొన్నారు.