గత ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ అన్నారు. సోమవారం యలమంచిలిలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.