యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రామచంద్రమ్మ గుడి ప్రాంతంలో దెబ్బతిన్న పైప్ లైన్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నట్లు మున్సిపల్ డీఈ మాధవరావు, ఏఈ గణపతిరావు తెలిపారు. సోమవారం పైప్ లైన్ మరమత్తు పనులను వారు పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ సాయంత్రానికి మరామ్మతులను పూర్తిచేస్తామన్నారు. 24వ తేదీ నుంచి యధావిధిగా తాగునీటిని సరఫరా చేస్తామన్నారు.