అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో పొలాల మీద కోసి ఆరబెట్టిన వరి పనలపై మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలని యలమంచిలి వ్యవసాయ శాఖ ఏడి ప్రభాకర్, వ్యవసాయ అధికారి మోహన్ రావు తెలిపారు. శుక్రవారం యలమంచిలిలో వారు దగ్గర ఉండి వరి పనలపై ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విధంగా చేయడం వల్ల ధాన్యం తడిచినా రంగుమారకుండా ఉంటాయన్నారు