యలమంచిలి పట్టణంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వద్ద అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడంతో ఎల్ఐసి కార్యాలయం నుంచి దిమ్మిలి రోడ్డు జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు తెలిపారు.