యలమంచిలి: పలు తనిఖీలు నిర్వహించిన ఆహార కమిషన్ సభ్యురాలు

72చూసినవారు
యలమంచిలి: పలు తనిఖీలు నిర్వహించిన ఆహార కమిషన్ సభ్యురాలు
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు జి. దేవి గురువారం తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో గల పాఠశాలలో వండిన అన్నం ముద్దగా ఉండడం, కొందరు విద్యార్థులకు అన్నం చాలకపోవడంతో ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆహారం నాణ్యతగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్