మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులను వినియోగించుకోవాలని భీమిలి మండలం టి. నగరపాలెం సర్పంచ్ పొట్నూరు ఛాయా గౌతమి ఉపాధి కూలీలను కోరారు. స్థానిక గ్రామ సచివాలయంలో బుధవారం ఉపాధి కూలీలకు సమావేశం నిర్వహించారు. ఇటీవల గ్రామ సభలో గుర్తించిన పనుల వివరాలను ఆమె వివరించారు. వలసల నివారణకు ఉపాధి పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో ఎంపిటిసి సభ్యులు పల్లా నీలిమ పాల్గొన్నారు.