భీమిలి: ధరల దరువుపై ఆగ్రహం
దేశంలో నిత్యావసరాలధరల పెరుగుదల తీవ్రమైన సమస్యగా మారిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జివిఎంసి ఏడో వార్డు మల్లయ్యపాలెం, అయోధ్యనగర్, కొత్తపాలెం ప్రాంతాల్లో నిత్యావసరాల ధరాభారంపై సిపిఐ ఆధ్వర్యంలో ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈసందర్భంగా పైడిరాజు పాల్గొని మాట్లాడుతూ, నిత్యావసరాల ధరలపెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర అర్థిక భారాన్ని మోపుతున్నాయన్నారు.