చోడవరం: ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్పాట్ అడ్మిషన్లు

53చూసినవారు
చోడవరం: ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్పాట్ అడ్మిషన్లు
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పాట్ అడ్మిషన్స్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ గురువారం తెలియజేశారు. ఏపీ పీజీ సెట్ 2024లో అర్హత పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అడ్మిషన్ల కొరకు హాజరయ్యే విద్యార్థులు ఏపీ పీజీ సెట్ అర్హత పత్రం, ఇతర ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్