కలకత్తాలో డ్యూటీ డాక్టర్ మౌమిత పై జరిగిన హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చోడవరం కొత్తూరు జంక్షన్లో సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అత్యాచారానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకుని శిక్షించాలని నినాదాలు చేశారు. బెంగాల్ ప్రభుత్వం అసలు దోషులను దాచి పెడుతూ, ఒక్కరినీ మాత్రం అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు.