ఈనెల 5 నుంచి గణేష్ దీక్షలు ప్రారంభం

50చూసినవారు
ఈనెల 5 నుంచి గణేష్ దీక్షలు ప్రారంభం
ఈనెల 5వ తేదీ నుంచి గణేష్ దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుందని చోడవరం విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకుడు కె చలపతి శుక్రవారం తెలిపారు. చోడవరం స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారిసన్నిధిలో ఈనెల 5వ తేదీన దీక్షలు ప్రారంభించి సెప్టెంబర్ 16తో మండల దీక్షలు ముగిస్తాయని తెలిపారు. అలాగే ఈ నెల 26 నుంచి వచ్చేనెల 16 వరకు అర్థ మండల దీక్షలు, వచ్చే నెల 7 నుంచి 16 వరకు నవరాత్రి దీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్