ఈ నెల 17న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాతవరం ఎంపిడిఒ ఎన్. హనుమంతరావు పిలుపునిచ్చారు. శుక్రవారం నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎంపిడిఒ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వాంతులు బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.