రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన అధికారులు

64చూసినవారు
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలాశయంలోకి చేరుతుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఆదివారం స్పిల్ వే గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్