క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

62చూసినవారు
క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నెల్లిపూడి గ్రామంలో.. వినాయక నవరాత్రుల సందర్భంగా నెల్లిపూడి క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నెల్లిపూడి గ్రామ ప్రజలు పాల్గొని వినాయక ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా నెల్లిపూడి గ్రామ సర్పంచ్ కొలుకులూరి సురేష్ వర్మ మాట్లాడుతూ.. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్