ప్రభుత్వం దృష్టికి తమలపాకులు రైతుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. పాయకరావుపేట మండలంలోని సత్యవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం తమలపాకు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమలపాకు రైతులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ తమలపాకుల రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.