ప్రతి ఒక్కరు మొక్కలు నాటడానికి ముందుకు రావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ లో శుక్రవారం వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.