ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ ను అనకాపల్లి ఎస్పీ ఎం. దీపిక గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలని, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు.