అచ్యుతాపురం: మూడో రోజు కొనసాగుతున్న అభిజిత్ కార్మికుల పోరాటం
అచ్యుతాపురం మండలంలో అభిజిత్ కార్మికుల పోరాటం మూడో రోజు కొనసాగుతుంది. యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ బుధవారం పరిశ్రమ గేటు వద్ద కార్మికులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. నరసింగరావు మాట్లాడుతూ అభిజిత్ యాజమాన్యం కార్మికులను మోసగించడానికి అక్రమ లే ఆఫ్ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని కోరారు.