అనంతపురం నగరంలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో గురువారం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్, జనసేన మహిళా నాయకురాలు పెండ్యాల శ్రీలతతో కలిసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేద ప్రజలు అన్న క్యాంటీన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలువురు జనసేన నాయకులతో భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.