నార్పల మండలం దుర్గం గ్రామానికి చెందిన సాకే సంతోశ్ జాతీయ స్థాయి అర్చరీ చాంపియన్షిప్ పోటీకు బుధవారం ఎంపికయ్యాడు. తండ్రి మారెన్న సిద్దరాచెర్ల గ్రామ నౌకరుగా, తల్లి సరస్వతి నార్పల ఎంఆర్సీలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నారు. సంతోశ్ అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 26న ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉపాధ్యాయులు తెలిపారు.