ప్రజల్లో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గురువారం ఫైరయ్యారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ పై బీజేపీ మిత్రపక్షాలు ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. గురువారం ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశానుసారం నగరంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.