అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కియా కార్ల సంస్థ ఉచితంగా అందించిన అత్యాధునిక కార్డియాక్ పరికరాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కలసి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ప్రజలకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు అందించడం చాలా సంతోషం అన్నారు. పరికరాలు అందించిన కియా ముఖ్య పరిపాలనాధికారి కబ్ డాంగ్ లీని మంత్రి సన్మానించారు.