సుబ్బరాయసాగర్ డ్యామ్ కు నీటిని విడుదల చేసి నింపాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ. తాడిపత్రి, శింగనమల ప్రాంతాలకు చెందిన తాము చాలా ఘోర పరిస్థితిలో ఉన్నామని, నీటిని విడుదల చేయాలని కోరారు. తమకు చుక్క నీరు లేదని, ముచ్చుకోట, పుట్లూరు, గరుగుచింతలపల్లి చెరువులు నింపాలని కోరారు.