గుత్తిలో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు

68చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సోమవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గబ్బర్ సింగ్ మూవీని రీ రిలీజ్ చేయడంతో అభిమానులు సినిమా థియేటర్ వద్ద సంబరాలు చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్