పామిడి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం సందర్శించారు. అనంతరం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెస్టిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.