పెనుకొండ: పూజా కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం, శ్రీకోన మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆదివారం జరిగిన పూజల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. అనంతరం శ్రీకోన మల్లికార్జున స్వామి కమిటీ సభ్యులు, భక్తాదులతో సమావేశంమై ఆశ్రమంలోని సమస్యలు, ఆలయ అభివృద్ధిపై ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తాదులు పాల్గొన్నారు.