రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ చేతుల మీదుగా పతాకావిష్కరణ గావించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధులు చూపిన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రజలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.