బుక్కరాయసముద్రం మండలం చెదుళ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ను తొలగించాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్ ఆర్ నారాయణస్వామి. తాహసిల్దార్ పుణ్యవతికి ఫిర్యాదు చేశారు. 2017 సం. లో చెదుల్ల గ్రామంలో మహిళా సాధికారత భవనానికి కేటాయించిన స్థలాన్ని ప్రస్తుత ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆక్రమించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.