బొలెరో ఢీకొని యువకుడి మృతి

81చూసినవారు
బొలెరో ఢీకొని యువకుడి మృతి
ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు తాడిపత్రిలోని సజ్జలదిన్నెకు చెందిన మహమ్మద్ షఫీవుల్లా (21) శుక్రవారం ద్విచక్ర వాహనంపై గుత్తి వైపుగా వస్తుండగా క్రిష్టిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ఘటనలో షఫీవుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్