ఉరవకొండ పట్టణంలోని 10 వార్డులో నివసిస్తున్న శర్మాస్ అనే వ్యక్తిని గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కర్ణాటక బస్సు కాలుపై దూసుకుపోయింది. దీంతో కాలుకి తీవ్రంగా గాయాలకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శర్మస్ కర్ణాటక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే కాలు పూర్తిగా విరిగిపోయిందని బాధితుడు వాపోయాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాలు విరిగిపోయిన బాధితునికి న్యాయం చేస్తామన్నారు.