ఉరవకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం పశువులకు నిలయంగా మారింది. ఈ మధ్య కాలంలో ప్రధాన రోడ్లపై తిరిగే పశువులు గుంపులుగా మైదానంలోకి వచ్చి ఆపరిశుభ్రం చేస్తున్నాయి. ప్రాంగణం ప్రహరీకి ఆనుకుని హోటళ్లు, దుకాణాల యజమానులు వ్యర్ధాలను ఇక్కడ పడేస్తున్నారు. పశువులను యజమానులు తరలించకపోతే, తామే దూరంగా తరలిస్తామన్న పంచాయతీ అధికారులు ఇప్పుడు పట్టించుకోకుండా ఉన్నారు.