నగరంలోని మెహెఫిల్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినుత్న బుధవారం తనిఖీలు నిర్వహించారు. చికెన్ షాంపీల్స్ ను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. అదే విధంగా వీధుల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల స్టాలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్, నగర పాలిత అధికారులు పాల్గొన్నారు.