తెలంగాణ రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను అనంతపురం కురుబ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఐలయ్యకు కురుబ సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, అధికార ప్రతినిధి దివిటి సోమశేఖర్, ఆవుల కృష్ణయ్య, చిట్రా శీనయ్య, చిరుతల విఠల్ గౌడ్, నీళ్ల పాల రాజగోపాల్, పావురాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.