దసరా నవరాత్రుల సందర్భంగా అనంతపురంలోని పాతూరు పరిధిలోని ఉమా నగర్లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం 'రాజ్మా, శనగ విత్తనాల' అలంకరణలో అమ్మవారిని అలంకరించారు. నగరంలోని భక్తులు అమ్మవారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాగే పరుశురాం, ఆలయ కమిటీ సభ్యులు రాజా, నరసింహులు, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.